PAVITROTSAVAMS CONCLUDES AT VONTIMITTA_ ఘనంగా ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

Vontimitta, 2 Sep. 19: The annual three-day Pavitrotsavams concluded at Vontimitta in YSR Kadapa District on monday.

On the last day, Maha Purnahuti, Kumbha Prokshana, Pavitra Vitarana were held as per the tenets of Pancharathra Agama Vidhi in the temple. In the evening there will be procession of deities encircling the temple.

DyEO Sri C Govindarajan, Superintendent Sri Hemachandra Reddy and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

తిరుపతి, 2019 సెప్టెంబ‌రు 02: ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు సోమ‌వారం ఉద‌యం మ‌హాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి.

సాయంత్రం 5.00 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం జరుగనుంది. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, సూపరింటెండెంట్ శ్రీ హేమచంద్రారెడ్డి , అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.