GIRIDHARA GOPALA SHINES ON SURYA PRABHA VAHANA _ సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారుడి అలంకారంలో శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడు

Tirupati, 26 Feb. 22: As part of the ongoing annual Brahmotsavams Suryaprabha Vahana Seva was held at Srinivasa Mangapuram on Saturday morning in Ekantam due to Covid restrictions.

 

Sri Kalyana Venkateswara decked as Giridhara Gopala holding mount Govardhana on His left hand little finger, blessed His devotees.

 

JEO Sri Veerabrahmam, Temple DyEO Smt Shanti, AEO Sri Gurumurthy, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayalu and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారుడి అలంకారంలో శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి,2022 ఫిబ్ర‌వ‌రి 26: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శ‌నివారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది

ఆయురారోగ్య‌ప్రాప్తి :

సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పండే పంటలు సూర్యతేజం వల్లనే వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.

రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

వాహ‌న సేవ‌లో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజి రంగ‌చార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.