GITA JAYANTI HELD _ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా గీతా జయంతి
WINNERS GIVEN AWAY PRIZES
TIRUPATI, 04 DECEMBER 2022: In connection with Gita Jayanthi on Sunday, the winners in the Bhagavat Gita shlokas recitation competition were given away prizes.
The program was held at Annamacharya Kalamandiram in Tirupati.
Speaking on the occasion the Special Officer of the Dasa Sahitya Project Sri Ananda Theerthacharyulu said by reciting shlokas of Bhagavat Gita, self-enlightenment will happen. Mahatma Gandhiji followed the principles of Gita and became a role model figure for honesty and truthfulness.
Among others National Sanskrit Varsity Professor Sri Sachidanandamurty, SVETA Director Smt Prasanti, Purana Pandit Sri Sesha Sai and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా గీతా జయంతి
– భగవద్గీత కంఠస్థం పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం
తిరుపతి, 2022 డిసెంబరు 04: హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం రాత్రి గీతా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీత కంఠస్థం పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ భగవద్గీత మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించే అద్భుతమైన గ్రంథం అన్నారు. గీతా పఠనం ద్వారా మానసిక వికాసం కలిగి మోక్షసాధనకు మార్గం సుగమమం అవుతుందని వివరించారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ గీతను పఠించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. విద్యార్థులు చిన్నప్పటినుంచి గీతా పఠనాన్ని అలవర్చుకుంటే అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారని చెప్పారు.
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య సచ్చిదానందమూర్తి, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, పురాణ పండితులు శ్రీ శేషసాయి అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీ భక్తవత్సలం ప్రచురించిన గీతామృతం పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఉచితంగా ఈ పుస్తకాన్ని పంపిణీ చేశారు.
అనంతరం ఇటీవల నిర్వహించిన భగవద్గీత కంఠస్థం పోటీల్లో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు ఆధ్యాత్మిక పుస్తకాలతో కూడిన బహుమతులు ప్రదానం చేశారు.
ఆ తర్వాత అతిథులను, న్యాయ నిర్ణీతలను సన్మానించారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.