TTD PRESENTS PATTU VASTRAMS TO SRIRANGAM TEMPLE _ శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ

Tirumala, 04 December 2022: As part of the tradition, TTD on Sunday presented pattu vastrams to Sri Ranganatha Swami temple at Srirangam.

Earlier the Srirangam temple Joint Commissioner Sri Marimuthu, Chief Archaka Sri Sundar Bhattar traditionally welcomed TTD officials who thereafter went in a procession and presented the Pattu vastrams. After Darshan, the temple officials presented Swami thirtha Prasadam to TTD officials.

TTD is following a tradition of maintaining spiritual links with the ancient Sri Vaishnava temple of Srirangam since 2006 to present Pattu vastrams on Tamil Karthika Ekadasi day.

It is well known that on the occasion of Anivara Asthanam at Srivari temple the vastrams are presented by Srirangam temple to Tirumala every year.

Srivari temple Parupattedar Sri Uma  Maheswar Reddy and others were present.

CHAKRA THIRTA MUKKOTI ON DECEMBER 5

TTD is organising the significant fete Chakra Thirtha Mukkoti on December  5 at Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ
 
తిరుమల, 2022 డిసెంబ‌రు 04: తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామివారికి ఆదివారం టిటిడి అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. 
 
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి అధికారులకు శ్రీరంగం ఆలయ జాయింట్‌ కమిషనర్‌ శ్రీ మారిముత్తు, ప్రధానార్చకులు శ్రీ సుందరభట్టర్‌ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
 
తమిళ కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని 2006వ సంవత్సరం నుంచి శ్రీరంగం ఆలయానికి టిటిడి పట్టువస్త్రాలు సమర్పిస్తోంది.  ప్రాచీన శ్రీవైష్ణవాలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆణివార ఆస్థానం సందర్భంగా ప్రతి ఏడాదీ శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న విషయం తెలిసిందే.
 
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి సతీమణి శ్రీమతి వై.స్వర్ణలత, శ్రీవారి ఆలయ పార్‌పత్తేదార్‌ శ్రీ పి.ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
డిసెంబ‌రు 5న చ‌క్ర‌తీర్థ ముక్కోటి
 
తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల‌లో ఒక్క‌టైన చక్రతీర్థ ముక్కోటి డిసెంబ‌రు 5న సోమవారం జరుగనుంది.
 
పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న శేషగిరులమీద దక్షిణభాగంలో మహా పవిత్రమైన చక్రతీర్థం ఉంది. చక్రతీర్థ ముక్కోటి నాడు ఉద‌యం అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాలతో ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీచక్రత్తాళ్వారువారికి, శ్రీనరసింహస్వామివారికి, శ్రీఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, పూజ‌లు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.