GLOBAL TENDERS FOR SPEEDY COMPLETION OF GOLD MALAM WORKS _ శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా

TIRUMALA, 27 JANUARY 2023: The Gold Malam works of Ananda Nilayam mulled by TTD in the month of February, has been postponed and decided to go far global tenders for time bound completion of the gold plating works to avoid inconvenience to the pilgrims, said TTD Chairman Sri YV Subba Reddy.

Speaking to media persons along with TTD EO Sri AV Dharma Reddy and JEO Sri Veerabrahmam at Annamaiah Bhavan in Tirumala on Friday, the Chairman said, the gold malam works taken up in Sri Govindaraja Swamy temple which has been given to a local contractor is still going on from the past two years. 

But in Tirumala, the works should be completed within the specific time schedule  as the temple is being visited by lakhs of devotees. So we are contemplating a work contract to a best contract calling for global tenders. As such we will come up with some other date after five or six months and ensure the works are completed within time bound to avoid inconvenience to pilgrims, he said. 

TTD GEARS UP FOR RADHA SAPTHAMI-CHAIRMAN

TIRUMALA, 27 JANUARY 2023: TTD has geared up for one day Brahmotsavam or Radha Sapthami which is scheduled on January 28 said, TTD Chairman Sri YV Subba Reddy.

Speaking to media persons along with EO Sri AV Dharma Reddy and JEO Sri Veerabrahmam at Annamaiah Bhavan in Tirumala on Friday, the Chairman said, the first vahanam commences at 5:30am with Suryaprabha Vahanam and concludes at 9pm with Chandraprabha Vahanam on Saturday. The seven day vahanams with Chakrasnanam in the afternoon takes place from dawn to dusk. 

All the departments including Annaprasadam, Health, Vigilance, have made arrangements to ensure that the visiting pilgrims have a hassle free darshan of vahana sevas in the four-mada streets. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా 
 
– త్వరలో మరో తేదీ నిర్ణయం
 
– టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
 
తిరుమల, 27 జనవరి, 2023: తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుండి ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని, ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
 
రథసప్తమి పర్వదినానికి ఏర్పాట్లు పూర్తి : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
 
తిరుమలలో శనివారం జరుగనున్న రథసప్తమి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
 
ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు మొదలవుతాయని  తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయన్నారు. వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.