GLORIOUS PUSHPA YAGAM IN SRI KRT_ వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

Tirupati, 22 April 2018: The celestial ritual of Pushpa yagam was conducted at the TTD sub temple of Sri Kodanda Rama Swamy Temple with awe inspiring chanting of vedic hymns, glittering lights and eye catching flower decorations.

As part of the event utsava idols of Sri Kodanda Rama swamy along with Sita Lakshman were given Snapana Tirumanjanam, the traditional Abhisekam with milk, honey, curd, turmeric sandal, coconut water. The sacred yagam was conducted on the birth star of Sri Rama, punarvasu and the archakas chanted the vishnu gayatri mantram 108 times. The Pushpa Yagam is aimed to purify the temple premises of any ritualistic ill doings by either the staff or the devotees during the last Brahmotsavam-March 16-24.

In the afternoon the Pushpa Yagam was performed amidst chanting of vedic hymns by archakas at the unjal mandapam where three tonnes of flowers of 12 varieties and six varieties of scented leaves- ganneru, chamanti, marigold, chamanti, sampangi, Roses etc. The flower decoration of the deities with flowers donated by devotees from AP, Tamil Nadu, Karnataka was a feast and showcased the grandeur of the ritual.

The sacred deities are paraded on the mada streets of the temple from 6.30pm to 8pm at night after the completion of the Pushpa Yagam and bless the devotees.

DyEO Jhansi Rani, Garden Supdt Sri Srinivasulu, Temple Supdt Sri Muni Krishna Reddy, Temple inspector Sri Sesha Reddy, Sri Murali Krishna and other devotees took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

తిరుపతి, 2018 ఏప్రిల్ 22: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.30 గంటలకు శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

మధ్యాహ్నం 3.00 గంటలకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా ప్రారంభ‌మైంది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ప‌త్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పుష్పాలు విరాళంగా అందాయి. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం.

శ్రీకోదండరామాలయంలో మార్చి 16 నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్స‌వాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

పుష్పయాగం అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.00 గంటల వరకు శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ ముర‌ళీకృష్ణ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.