MAHA SAMPROKSHANA AT SRI SRINIVASA SHIRINE OF SRI PAT, TIRUCHANOOR_ తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయ మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Tirupati, 22 April 2018: The holy event of Maha samprokshanam and alaya punah pratistha of the TTD sub temple, Sri Srinivasa temple within the Sri Padmavati Ammavari Temple at Trichanoor commenced with Ankurarpanam today.

The rituals of Mahasamprokshanam which include special homams and pujas will be held in the sub temple from April 23-27. They include Chatustarchana Nitya homam and Dhanyadivasam of new idols, Jaladhinam, Kshiradhinam on April 23 and 24.

On April 25 and 26 Shayyadhivasam, Karmanga Snapanam and Panchashayya divasam will be performed in a unique ritualistic forms.

The rituals of Punah pratista of idols and Maha samprokshanam will be performed in a marvelous and sublime manner on April 27 and later on devotees will be allowed darshan of the deity.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయ మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2018 ఏప్రిల్ 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ శ్రీనివాస ఆలయ పున: ప్రతిష్ట, మహాసంప్రోక్షణకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఇందులోభాగంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఏప్రిల్ 23 నుండి 27వ తేదీ వరకు మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

ఏప్రిల్‌ 23వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గటల వరకు చతుష్ఠానార్చన, సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు నిత్యహోమం, నూతన విగ్రహలకు దాన్యాధివాసం, ఏప్రిల్‌ 24వ తేదీ ఉదయం జలాధివాసం, సాయంత్రం క్షీరాధివాసం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 25వ తేదీ సాయంత్రం శయ్యాధివాసం, ఏప్రిల్‌ 26వ తేదీ సాయంత్రం కర్మాంగ స్నపనం, పంచశయ్యాధివాసం జరుగనుంది. ఏప్రిల్‌ 27వ తేదీ ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు పున: ప్రతిష్ట, మహాసంప్రోక్షణ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.