GO DHULI- GO PUJA _ ప్రత్యేక ఆకర్షణగా ‘గోధూళి’
SPECIAL ATTRACTION OF GMS
Tirupati, 31 Oct. 21: TTD organised the Go Dhuli-Go Puja, by Pontiff of Kanchi Kamakoti peetham Sri Sri Sri Vijayendra Saraswati as a special attraction of the two day Go Maha Sammelan that concluded on Sunday.
The Kanchi pontiff performed the pujas to a Kapil breed of cow and calf specially got up at the Mahati auditorium.
The Sapta Go Sandsrshana shala at the Sammelan venue was a spectacular showcase of a variety of desi breed milch bovines like Kankrej Gir, Ongole Kangeyam, Hallikar, and Sahiwal, which were participants of the Go Dhuli program.
The goal of the program was to highlight the fact that the land with local desi breed of cows was ever fertile.
TTD chairman Sri YV Subba Reddy, EO DrKS Jawahar Reddy Tirupati MLA Sri B Karuakar Reddy, TTD board members Sri Ashok Kumar, Sri M Ramulu, Sri T Maruti Prasad were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ప్రత్యేక ఆకర్షణగా ‘గోధూళి’
శాస్త్రోక్తంగా గోపూజ
తిరుపతి, 2021 అక్టోబరు 31: టిటిడి ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న జాతీయ గో మహాసమ్మేళనం ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘గోధూళి’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి పాల్గొని కపిల గోవుకు, దూడకు గోపూజ చేశారు.
ఇక్కడి సప్త గో సందర్శనశాలలో పుంగనూరు, కాంక్రేజు, గిర్, ఒంగోలు, కాంగేయం, హళ్లికార్, సాహివాల్ జాతుల గోవులు, వాటి దూడలను ఏర్పాటుచేసి గోధూళి కార్యక్రమం నిర్వహించారు. భూమాతకు అత్యంత ప్రీతిపాత్రమైనది గోమాత. ఎక్కడైతే గోసంతతి సమృద్ధిగా ఉండి గోధూళి ఉత్పన్నమవుతుందో అక్కడ విస్తారంగా పంటలు పండి సస్యశ్యామలంగా ఉంటుంది. దీన్ని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్‌కుమార్, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ టంగుటూరు మారుతీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.