ORGANIC FARMING COULD RESOLVE WORLD FOOD ISSUE, SAYS RETD IAS VIJAY KUMAR _ ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో ప్ర‌పంచ ఆహార స‌మ‌స్యను ప‌రిష్క‌రించ‌వ‌చ్చు – విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ విజ‌య్‌కుమార్‌

Tirupati, 31 Oct. 21:  Three crops a year with Organic farming practices could address the world food scarcity, says organic farming expert Sri Vijay Kumar, Retd.IAS

Addressing the ongoing Go Maha Sammelan said excess use of pesticides and insecticides had reduced fertility of the soil and thereby microbes and nutritious content in the crops leading to rise in diseases

He said with organic farming practices one could raise three crops a year in lands with low rainfall and without irrigation facilities. He said all-natural calamities were the outcome of low wetness in soil caused by excess exposure to Sun and fall in carbon content in Soil.

 He lauded the TTD initiatives to purchase organic products subsequent to an MoU signed with the AP Rythu Sadhikara Samstha in the presence of AP chief minister Sri YS Jaganmohan Reddy.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో ప్ర‌పంచ ఆహార స‌మ‌స్యను ప‌రిష్క‌రించ‌వ‌చ్చు – విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ విజ‌య్‌కుమార్‌

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 31: గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో సంవ‌త్స‌రానికి మూడు పంట‌లు పండించి ప్ర‌పంచ ఆహార స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చ‌ని విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ విజ‌య్‌కుమార్ ఉద్ఘాటించారు. తిరుప‌తి మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో టిటిడి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న గో మ‌హాస‌మ్మేళ‌నంలో ఆదివారం ఆయ‌న ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ విజ‌య్‌కుమార్ మాట్లాడుతూ ర‌సాయ‌న ఎరువుల వాడ‌కం వ‌ల‌న భూసారం త‌గ్గి మొక్క‌లు భూమిలోని పౌష్టిక విలువ‌లు అందుకోలేక పోతున్నాయ‌న్నారు. అందువ‌ల‌న సూక్ష్మ పోష‌కాలు లేని ఆహారం తీసుకోవ‌డం వ‌ల‌న‌ అనారోగ్య స‌మ‌స్య‌లు అధిక‌ముతున్న‌ట్లు తెలిపారు. గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా త‌క్కువ వ‌ర్ష‌పాతం, నీటి పారుద‌ల సౌక‌ర్యాలు లేని మెట్ట భూముల్లో కూడా సంవ‌త్స‌రానికి మూడు పంట‌లు పండించ‌వ‌చ్చ‌ని చెప్పారు. స‌మీప భ‌విష్య‌త్తులో ప్ర‌పంచం ఎదుర్కోబోతున్న అతిపెద్ద ఆరోగ్య‌విప‌త్తును స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డానికి గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయ‌మే ఏకైక మార్గ‌మ‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించ‌డానికి అనేక ప్రోత్సాహ‌కాల‌ను అందిస్తోంద‌న్నారు.

ఇటీవ‌ల రాష్ట్ర ముఖ్య మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ వైఎస్. జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి స‌మ‌క్షంలో స‌హ‌జ వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌పై రైతు సాధికార సంస్థ‌తో టిటిడి ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలిపారు. త‌ద్వారా టిటిడికి అవ‌స‌ర‌మైన ముడి ఆహార ప‌దార్థాలు గో ఆధారిత వ్య‌వ‌సాయంతో పండించిన రైతుల నుండి నేరుగా కోనుగోలు చేయ‌నుంద‌ని చెప్పారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.