GODA KALYANAM HELD AT ANNAMACHARYA KALAMANDIRAM _ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం

TIRUPPAVAI PASURA PARAYANAM CONCLUDES

TIRUPATI, 14 JANUARY 2023: With the holy Dhanurmasam entering the last day on Saturday, Tiruppavai Pasura Parayanam concluded in Annamacharya Kalamandiram at Tirupati.

TTD has organised the fete at 250 centres across the country during the entire month with eminent scholars.

On the last day, the auspicious Goda Kalyanam was observed.

TTD FACAO Sri Balaji, SVETA Director Smt Prasanthi, Alwar Divya Prabandha Project Co-ordinator Sri Purushottam, Pravachana Scholar Sri Ranganathan, Program Assistant Smt Kokila and local devotees participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం

ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు

తిరుపతి, 2023 జనవరి 14: పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 250 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు.

ముందుగా శ్రీ గోదాదేవి(ఆండాళ్‌), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై కొలువుతీర్చారు. అనంతరం  శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది.

అన్నమాచార్య కళామందిరంలో ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు

టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 17 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు శనివారం ముగిశాయి. తిరుపతికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ చక్రవర్తి రంగనాథన్‌ ఇక్కడ తిరుప్పావై  ప్రవచనాలు వినిపించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తం, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ‌మ‌తి కోకిల, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.