GODA KALYANAM OBSERVED WITH FERVOUR _ కన్నుల పండువగా గోదా కల్యాణం

Tirupati, 15 January 2024: The Festival of Goda Kalyanam was grandly held on Monday evening at TTD parade grounds drawing devout citizens of Tirupati. 

Earlier the Utsav idols of Sri Krishna Swamy and Sri Andal Ammavaru were brought to a special platform. 

The pleasant evening witnessed the lively performance of dance ballets and sannkeertans by students of SV College of Music and Dance College and vocal by the artists of the Annamacharya Project.

Thereafter, the Archakas of Srivari temple performed special pujas including Punyahavachanam, Ankurarpanam, Raksha bandhanam, Agni Pratishta and sankalpam. 

After several special homas, Purnahuti, Nivedana and Mangala Harati with Govinda namams, sankeertans the colourful program concluded on a grand note.

Dr Akella Vibhishan Sharma, the Director of the Annamacharya project highlighted the significance of Sri Goda kalyanam. 

JEO Sri Veerabrahmam, VC of SV Vedic University Acharya Rani Sadashivamurthy, CEO SVBC Sri Shanmukh Kumar, one of the chief priests of Tirumala temple Sri Venugopala Dikshitulu, DyEO Sri Lokanatham, Smt Uma Muddubala the Principal of SVCMD were also present. 

The program was live telecast by SVBC for the sake of global devotees.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కన్నుల పండువగా గోదా కల్యాణం

తిరుపతి, 15 జనవరి 2024: టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో సోమవారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది.

ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ రఘునాథ బృందం అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించింది. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆతరువాత మహా సంకల్పం, స్వామి,అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరించి గోదా కల్యాణం విశిష్టతను వివరించారు.

జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్,
శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల్ దీక్షితులు, ఎస్వీ సంగీతనృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా ముద్దు బాల తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.