GODA PARINAYAM AND PARUVETA UTSAVAM IN TIRUMALA ON JAN 16_ జనవరి 16న శ్రీ‌వారి ఆల‌యంలో అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ ర‌ద్దు

ANGA PRADAKSHINA CANCELLED ON JAN 16

Tirumala, 14 Jan. 19: The Paruveta Utsavam will be observed in Tirumala on the day of Kanuma on January 16.

Earlier in the morning following Goda Parinayam, a procession will be organised for floral garlands of Andal Sri Godai from Pedda Jiyar Mutt in four mada streets and later will be offered to the presiding deity of Lord Venkateswara in Tirumala temple.

Later in the afternoon, Paruveta Utsvam will be observed from 1pm onwards, wherein Sri Malayappa Swamy along with Sri Krishna Swamy reaches Paruveta Mandapam and Asthanam, mock hunt fete are performed.

TTD has cancelled all arjitha sevas following this fete on January 16 in Tirumala temple. Even the Anga Pradakdhina is also cancelled on January 16.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 16న శ్రీ‌వారి ఆల‌యంలో అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ ర‌ద్దు

తిరుమల, 2019 జనవరి 14: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో ప్ర‌తిరోజు తెల్ల‌వారుజామున భ‌క్తుల‌కు క‌ల్పించే అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ‌ను జ‌న‌వ‌రి 16వ తేదీ బుధ‌వారం టిటిడి ర‌ద్దు చేసింది. ప్ర‌తి ఏడాది శ్రీ‌వారికి నిర్వ‌హించే పార్వేట ఉత్సవం సంక్రాంతి కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్రత్యేక కార్య‌క్ర‌మాలు నిర్వహించ‌నున్నారు. కావున టిటిడి అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ ర‌ద్దు చేసింది, భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌గ‌ల‌రు.

జ‌న‌వ‌రి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం – గోదాపరిణయోత్సవం

తిరుమల శ్రీవారి ఆల‌యంలో గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9.00 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

ఆనంత‌రం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.

ఆర్జితసేవలు రద్దు :

ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాలసేవ, అర్చన, స‌హ‌స్ర క‌ళాశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.