GODA KALYANAM OBSERVED AT ANNAMACHARYA KALAMANDIRAM_ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం

Tirupati, 14 Jan. 19: On the occasion of last day of Dhanurmasam on Monday, Alwar Divya Prabandha Project of TTD organised Goda Kalyanam at Annamacharya Kalamandiram in Tirupati.

Kumari M. Bhanuja and Troupe of Tirupati have rendered Varanamayiram pasurams in the form of Kuchipudi dance in a splendid manner and enthralled the audience. Varanamayiram is a poetic song composed Goda Devi describing her friends about her dream of wedding Lord Krishna. The programme concluded with Goda Kalyam.

TTD FA & CAO Sri O Balaji and others have attended the programme.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం

తిరుపతి, 2019 జనవరి 14: పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలోసోమ‌వారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా శ్రీవైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పాశురాల ప్రవచనాలు నిర్వహించారు.

ముందుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ గోదాదేవి(ఆండాళ్‌), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గానం, నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి శ్రీ బాలాజి, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.