GODA PARINAYAM HELD IN GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదా పరిణయోత్సవం
PARUVETA ON JAN 17
Tirupati, 16 Jan. 22: The celestial Goda Parinayotsavam was held in Sri Govinda Raja Swamy temple in Tirupati on Sunday evening.
The Paruveta Utsavam will be observed on January 17 in Ekantam.
Special Grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravi Kumar Reddy and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదా పరిణయోత్సవం
తిరుపతి, 2022 జనవరి 16: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం గోదా పరిణయోత్సవం నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన చేపట్టారు. ఉదయం 5.30 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి మేల్‌ఛాట్ వస్త్రం, పూలమాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన మేల్‌ఛాట్ వస్త్రం, పూలమాలలను తిరుమల శ్రీవారికి పంపారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయంలో వద్ద గోదా పరిణయోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ వెంకటాద్రి, పాల్గొన్నారు.
జనవరి 17న పార్వేట ఉత్సవం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 17న పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, కల్యాణమండపంలో ఆస్థానం నిర్వహించి తిరిగి ఆలయానికి చేరుస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.