GODA PARINAYAM OBSERVED _ తిరుమల శ్రీవారికి గోదా మాలలు
Tirumala, 16 Jan. 20: The sacred garlands brought from Andal Ammavaru located in Sri Govindaraja Swamy temple in Tirupati were decked to Sri Venkateswara Swamy on Thursday on the occasion of Goda Parinayam.
Earlier the procession of garlands commenced from Pedda Jiyar mutt in Tirumala and proceeded to temple.
Later the archakas decorated these garlands to Srivari signifying the celestial wedding of Goda Parinayam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమల శ్రీవారికి గోదా మాలలు
తిరుమల, 2020 జనవరి 16: శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలాలు శ్రీవారి మూలవిరాట్‌కు గురువారం ఉదయం అలంకరించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవిమాలాలు తిరుపతి నుండి శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్ద జియ్యార్‌స్వామివారి మఠానికి గురువారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్ మఠం నుండి మంగళవాయిధ్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజియ్యార్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జియ్యార్ స్వామి,ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.