GODDESS AS “PARAMAPADANATHA VAIKUNTHANADHA” BLESSES DEVOTEES_ పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయణుడి అవతారంలో సిరులతల్లి

Tiruchanur, 16 November 2017: Universal Divine Mother, Goddess Padmavathi Devi in the guise of “Paramapadanadha Venkatanadha” blessed the devotees on Pedda Sesha Vahanam on Thursday morning.

As a part of the ongoing annual nine day Karthika Brahmotsavams on second day morning, the divine mother in all Her splendour took celestial ride along four mada streets on Adisesha-the 1000 hooded mighty serpent king.

The Jiyar Swamis lead by HH Sri Pedda Jiyangar Swamy rendered “Irandam Tiruvadi” from Alwar Divya Prabandham in front of vahana seva.

TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, Spl.Gr.Dy.EO Sri Muniratnam Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయణుడి అవతారంలో సిరులతల్లి

తిరుపతి, 2017 నవంబరు 16: లోక రక్షణి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన గురువారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠ నాథుడు శ్రీమన్నారాయణుడి అవతారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.30 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

శ్రీపద్మావతి మాతకు కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారు తన భర్త శ్రీమహావిష్ణువు అవతారంలో పెద్దశేష వాహనంపై భక్తులను కటాక్షిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో అమ్మవారు వివిధ వాహనాలపై వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వాహనసేవలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ పెద్దశేష వాహనంపై అమ్మవారిని దర్శిస్తే సమస్త దోషాలు తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. భక్తులు సంతృప్తికరంగా అమ్మవారి వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.