GODDESS AS SRINIVASA MURTHY GLITTERS ON SURYAPRABHA _ సూర్యప్రభ వాహనంపై శ్రీ శ్రీనివాసమూర్తి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు
Tiruchanoor, 17 Nov. 20: On the seventh day morning on bright sunny Tuesday morning, Goddess Padmavathi decked as Srinivasa Murthy glittered on Suryaprabha Vahanam.
TTD JEO Sri P Basanth Kumar, CE Sri Ramesh Reddy, DyEO Smt Jhansi Rani, Additional Health Officer Dr Sunil Kumar, VGO Sri Bali Reddy, AEO Sri Subramanyam were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
సూర్యప్రభ వాహనంపై శ్రీ శ్రీనివాసమూర్తి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుపతి, 2020 నవంబరు 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం ఉదయం అమ్మవారు శ్రీ శ్రీనివాసమూర్తి అలంకారంలోని సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో శ్రీ పి.బపంత్‌కుమార్ దంపతులు, సిఇ శ్రీ రమేష్‌రెడ్డి, విఎస్వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.