TN CM OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి గౌ|| శ్రీ ఎడప్పాడి పళనిస్వామి

Tirumala, 17 Nov. 20: The Honourable CM of Tamil Nadu Sri Edappadi Palanisamy offered prayers to Lord Venkateswara on Tuesday.

On his arrival, he was received by TTD EO Dr KS Jawahar Reddy and after darshan he was rendered Vedasirvachanam at Ranganayakula Mandapam.

He was presented with Theertha Prasadams by TTD EO.

TTD Board Member Sri Kumarguru, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి గౌ|| శ్రీ ఎడప్పాడి పళనిస్వామి

తిరుమల, 2020 నవంబరు 17: తమిళనాడు ముఖ్యమంత్రి గౌ|| శ్రీ ఎడప్పాడి పళనిస్వామి మంగళవారం ఉదయం శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా ఆలయం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ పళనిస్వామికి టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు.

స్వామివారి ద‌ర్శ‌నానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ పళనిస్వామికి వేద‌పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం ఈఓ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ జగన్ మోహనాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.