GODDESS DONS “KALIYA MARDHANA” AVATARA ON SARVABHUPALA VAHANAM_ సర్వభూపాల వాహనంపై కాళీయమర్దనుడి అవతారంలో అలమేలుమంగ

Tiruchanur, 20 November 2017: As a destroyer of evil forces, Universal Mother Goddess Padmavathi Devi donned “Kaliyamardhana” Avatara on the Sarvabhupala Vahanam.

Sri Venkateswara Swamy is Lord of Lords. As His better half Goddess graces all worlds with kindness. But when it come to protect good from evil She too takes aggressive form to weed off evil forces.

To showcase the same, she donned the guise of Kaliyamardhana on Sarvabhupala Vahanam on sixth day morning on Monday as part of the nine day annual Brahmotsavams at Tiruchanoor.

TTD EO Anil Kumar Singhal, JEO Tirupati Sri P Bhaskar, Spl Gr DyEO Sri Muniratnam Reddy, CVSO Sri Ake Ravikrishna, ACVSO Sri Sivakumar Reddy and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వభూపాల వాహనంపై కాళీయమర్దనుడి అవతారంలో అలమేలుమంగ

తిరుపతి, 2017 నవంబరు 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయమర్దనుడి అవతారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో దర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

వాహనసేవ అనంతరం మధ్యాహ్నం 12.00 నుండి 2.00 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.

శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ అమ్మవారి సర్వభూపాల వాహనంపై కాళీయమర్దనుడి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించి, సేవిస్తే రాజయోగం కలుగుతుందని తెలిపారు. వాహనసేవలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారని, అదేవిధంగా ఈ రోజు రాత్రి గరుడసేవలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలన్నారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ దంపతులు, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ రాధాకృష్ణ, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.