FOLK DANCES HAD A HEY DAY IN BRAHMOTSAVAMS_ సర్వభూపాల వాహనసేవలో కళాకారుల కోలాహలం

Tiruchanur, 20 November 2017: The folk dance artistes who hailed from southern states of India have been remaining as a special attraction during annual fete.

On Monday it is the turn of folk dancers from Telengana to show their expertise before vahanam procession. The Kommu Koya and Oggudolu performed by Sri Rajaiah team from Bhadrachalam and Sri Ravi team from Janagama stood as a special attraction during Sarvabhupala Vahanam.

Earlier Sankha Naadam by Sri Subramaniyam from Tiruvetriyur of Tamilnadu also caught the attention of devotees.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

సర్వభూపాల వాహనసేవలో కళాకారుల కోలాహలం

తిరుపతి, 2017 నవంబరు 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం సర్వభూపాల వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా తమిళనాడులోని తిరువెట్రియూరుకు చెందిన వడివడియ మాణిక్య సంఘంకు శ్రీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో 17 మంది కళాకారుల బృందం ”శంఖనాదం” కళా ప్రదర్శన భక్తులలో భక్తి భావాన్ని పెంచింది. శంఖనాదం అనేది పలు ఆలయాలలో కైంకర్యాల సమయంలో, శంఖనాదాన్ని ఉపయోగిస్తారు.

తెలంగాణ రాష్ట్రం భద్రాచలానికి చెందిన శ్రీ ఎమ్‌.రాజయ్య ఆధ్వర్యంలో 26 మంది కళాకారుల బృందం”కొమ్ము కోయ నృత్యం” భక్తులను ఆకర్షించింది. ఇందులో 13 మంది పురుషులు డోలు, 12 మంది మహిళలు నృత్య ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా జనగామ జిల్లా మాణిక్యపురానికి చెందిన ఒగ్గు రవి ఆధ్వర్యంలో 50 మందికి పైగా కళాకారుల బృందం ”ఒగ్గు -డోలు” ప్రదర్శన ఇచ్చారు. ఇందులో 45 మంది డోలు, 5 మంది తాళాలు, ఒకరు జాగంట మోగించారు. పోతురాజు బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతి బింబించేలా ఈ ప్రదర్శన సాగింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.