GODDESS OF RICHES RIDES MANY VAHANAS AT TIRUCHANOOR _ వాహన సేవల్లో సిరులతల్లి అభయం
Tirupati,16 February 2024: Goddess of riches, Sri Padmavati Devi took out a celestial ride on several vahanams to bless devotees and grant boons on the occasion of Ratha Sapthami fete on Friday from morning to night.
The religious fervour of bliss which began with Surya Prabha Vahanam in the morning ended with Aswa Vahana in the evening after a break for snapana thirumanjanam in the afternoon in Tiruchanoor .
Artists of HDPP, Dasa Sahitya projects and SV College of music and Dance presented kolatams, chakka bhajans etc. to engage the devotees.
DyEO Sri Govindarajan, AEO Sri Ramesh and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
వాహన సేవల్లో సిరులతల్లి అభయం
తిరుపతి, 2024 ఫిబ్రవరి 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.
ఉదయం 7.15 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు,
పసుపు, చందనంలతో అమ్మవారిని విశేషంగా అభిషేకించారు. సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారు చంద్రప్రభ, గజ వాహనంపై దర్శనమివ్వనున్నారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల బృందాల కోలాటాలు, చెక్కభజనలు, భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా బంధాల అధికారిచే విడుదల చేయబడినది.