GODDESS PADMAVATHI DEVI DONS THE AVATAR OF “SARVAPHALAPRADAYANI” VARALAKSHMI DEVI_ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శోభాయమానంగా వరలక్ష్మీవ్రతం
VARALAKSHMI VRATAM PERFORMED WITH RELIGIOUS FERVOUR IN SRI PAT
Tiruchnaoor, 4 August 2017: The temple town of Tiruchanoor, which is always abuzz with pilgrim activity due to the presence of famous shrine of Sri Padmavathi Devi, on Fridayattained enhanced look as Varalakshmi Vratam has been celebrated with religious fervour.
The “Goddess of Riches” in all Her divine splendour, seated elegantly on a specially decked floral and illuminated platform at Asthana Mandapam in Tiruchanoor. The archakas commenced Varalakshmi Vratam by chanting the 108 sacred names of Goddess. The Vrata kankanam is also performed. This kankanam is the sacred thread consisting nine threads, with each one dedicated to one for of Goddess Maha Lakshmi.
While first thread represents the divine name “Kamalai Namaha”, second Pramayai Namaha, Lokamatre Namaha, Vishwa Jananyai Namaha, Mahalakshmai Namaha, Kheerabdi Tanayayai Namaha, Vishwa Sakshinayai Namaha, Chandra Sahodariyai Namaha and with the ninth “Grandhi” – sacred thread representing the name “Hari Vallabhayai” Namaha.
Later Vrata Katha was rendered. The devotees who thronged to witness the celestial fete were enthralled by the divine beauty of Goddess Sri Padmavathi Devi.
TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri P Bhaskar, CV and SO Sri A Ravikrishna, temple Spl.Gr.DyEO Sri P Munirathnam Reddy and others were also present.
GODDESS DRAPED IN GOLDEN SARI
On the celestial occasion of Varalakshmi Vratam, the presiding deity of Goddess Sri Padmavathi Devi was draped in the precious stones studded golden sari.
The pilgrims thronged in large numbers to the temple, to witness Goddess in special alankaram which is a very rare visual treat.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శోభాయమానంగా వరలక్ష్మీవ్రతం
తిరుపతి, 2017 ఆగస్టు 04: సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ దంపతులు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్ దంపతులు, సివి అండ్ ఎస్వో శ్రీ రవికృష్ణ దంపతులు పాల్గొన్నారు.
వరలక్ష్మీవ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీపద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శత నామావళి నివేదన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరుఆకు, మరువము, తామరపూలు, వృక్షి, మొగళిరేకులు వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు.
ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) తయారు చేసిన కంకణాన్ని కుడి హస్తనికి అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఓం శ్రీ కమలాయైనమః, ఓం శ్రీ రమయైనమ, ఓం శ్రీ లోకమాత్రేనమ, ఓం శ్రీ విశ్వజనన్యైనమః, ఓం శ్రీ మహాలక్షియైనమః, ఓం శ్రీ క్షీరాబ్దితనయైనమః, ఓం శ్రీవిశ్వసాక్షిన్యైనమ, ఓం శ్రీ చంద్ర సహోదరిన్యై నమః, ఓం శ్రీ వరలక్ష్మియై నమః అని ఆరాధించారు. సాధారణంగా మహిళలు ఎడమ హస్తనికి కంకణం ధరిస్తారు. కానీ వరలక్ష్మీ వ్రతం పర్వదినాన మాత్రం కుడి హస్తనికి కంకణం ధరించడం ఆనవాయితి.
అనంతరం వేంకటాచల మహత్యం స్కాంద పురాణంలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని అర్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు భక్తులకు తెలియజేశారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు. శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం ఆచరించాలని, ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్య సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని ఆయన వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలితం సిద్ధిస్తుందని ఆయన తెలిపారు.
తరువాత ఐదు రకాల కుడుములు, ఇడ్లి, కారంతో చేసిన ఇడ్లి, తియటి ఇడ్లి, లడ్డు, వడ, అప్పం, పోలి వంటి 12 రకాల నైవేధ్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది. వ్రతంలో పాల్గొన్న భక్తులకు పసుపు దారాలు, పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ చేశారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న వ్రత మండపం
టిటిడి గార్డెన్ విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. టిటిడి ఈవో, తిరుపతి జెఈవో ఆదేశాల మేరకు గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో గార్డెన్ విభాగానికి చెందిన 30 మంది సిబ్బంది, మూడు రోజుల పాటు శ్రమించి వ్రత మండపాన్ని శోభాయమానంగా అలంకరించారు.
ఇందులో అపిల్, ద్రాక్ష, ధానిమ్మ, బత్తయి, ఫైనాపిల్ వంటి సాంప్రదాయ ఫలలు, వివిధ సాంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని సర్వాంగా సుందరంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, క్రింది భాగంలో రెండు వైపుల ధనలక్ష్మీ అమ్మవారి విగ్రహాలు, ఐరావతాలు ఏర్పాటు చేశారు. క్రిస్టల్స్‌తో కూడిన పిలర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థానమండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, రోజాలు, బంతి, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో అలంకరించారు.
బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీపద్మావతి అమ్మవారు
శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. వరలక్ష్మీ వ్రతం వంటి ప్రత్యేక పర్వదినాలలో మాత్రమే అమ్మవారు బంగారు చీరలో భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందారు.
భక్తుల భద్రతకు పెద్దపీట
టిటిడి ఈవో, తిరుపతి జెఈవో ఆదేశాల మేరకు సివి అండ్ ఎస్వో, అదనపు సివిఎస్వో శ్రీశివకుమార్‌రెడ్డి పర్యవేక్షణలో ఆలయ ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది టిటిడి భద్రతా సిిబ్బందితో భక్తులకు ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి,ఏఈవో శ్రీ రాధకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.