PAVITRA GARLANDS ADORNED TO LORD_ శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ

Tirumala, 4 August 2017: On the second day of the ongoing three day annual Pavitrotsavams which is also known as Sarva Kamaprada Utsavam, the processional deities of Sri Malayappa Swami, Sri Devi and Bhu Devi were decked with sacred Pavitra Malas on Friday.

These silk threads spun in different natural colours are made into a garland and it will be adorned to deities after Snapana Tirumanjanam.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Rama Rao, Peishkar Sri Ramesh, Bokkasam incharge Sri Gururaja RAO, OSD Sri Seshadri and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రాల సమర్పణ

తిరుమల, 04 ఆగస్టు 2017 : తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాల సందర్భంగా శుక్రవారం వైభవంగా పవిత్ర సమర్పణ జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పవిత్రాలను వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, శ్రీభూవరాహస్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు.

కాగా, చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.

సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు నిర్వహిస్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల కారణంగా నిజపాదదర్శనం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దయ్యాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.