GODDESS RIDES KALPAVRIKSHA AS “AHALYA SAPAVIMOCHANA RAMA”_ కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో సిరులతల్లి

THEMATIC TOUCH TO VAHANA SEVAS

Tiruchanoor, 7 Dec. 18: On the fourth day morning on Friday, Sri Padmavathi Devi blessed devotees as “Ahalaya Sapavimochana Rama as a part of the ongoing annual karthika brahmotsavams at Tiruchanoor.

Kalpavriksha is one among the five “Daiva Vriksha”-Divine Trees mentioned in Puranas. Mandara, Parijatha, Samantaka, Hari chandana and Kalpavruksha are the Pancha Daiva Vrikshas that adorn the garden of Nananahan am owned by Lord Indra.

The speciality of this tree is that it is revered as Tree of Eternity. It is considered as a wish fulfilling tree.

VAHANA SEVAS GET THEMATIC TOUCH

Change from the routine, the puranic themes to vahana devas is adding extra flavour and attracting devotees in a big way during the ongoing brahmotsavams at Tiruchanoor.

On Friday, the Goddess cheered Her devotees with one of the prominent episodes taken from Ramayanam, “Ahalya Sapavimochanam” where Ahalya, the spouse of sage Gautama, was cursed by him to become a stone and regains her human form after she is brushed by Lord Sri Rama’s foot.

TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy,Dy.EO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో సిరులతల్లి

తిరుపతి, 2018 డిసెంబరు 07: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం ఉదయం అమ్మవారు అహల్యకు శాపవిమోచనం ఇచ్చిన శ్రీ రామచంద్రమూర్తి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవీగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవ కోలాహలంగా సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.

మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

అలాగే రాత్రి 8.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి అలమేలుమంగమ్మ సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. ఆ సీతామాత కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ దంపతులు,సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి , అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి , విజీవో శ్రీ అశోక్ కుమార్ గౌడ్ , ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం , ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.