RELIGIOUS BOOKS RELEASED_ కల్పవృక్ష వాహనములో 3 ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
Tiruchanoor, December 7,2018: TTD Executive Officer Sri Anil Kumar Singhal along with Tirupati JEO Sri Pola Bhaskar released three TTD publications-one in Hindi, one in Tamil and another in Telugu in front of the Kalpavruksha vahanam on Friday.
They were Praja Margadarshini Bhagavad Gita by Sri Pothuri Venkateswara Rao, Adishankara Shan matham in Tamil by Sri KS Subramanyam and Sri Venkateswaraswami ke Brahmotsav Vaibhav in Hindi by Dr M R Rajeshwari.
Later they also felicitated the authors of these publications with Shawls and Prasadams.
The TTD publication OSD Dr Talluri Anjaneyulu and sub editor Dr N Narasimha Charya participated in the event.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
కల్పవృక్ష వాహనములో 3 ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుపతి, 2018 డిసెంబరు 07: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై అహల్యకు శాపవిమోచనం ఇచ్చిన శ్రీరాచంద్రమూర్తి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన ప్రజామార్గదర్శిని భగవద్గీత, ఆదిశంకర షణ్యతమ్ (తమిళం), తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికే బ్రహ్మోత్సవ వైభవ్ (హిందీ) పుస్తకాలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఆవిష్కరించారు. అనంతరం రచయితలను శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా.. తాళ్లూరు ఆంజనేయులు, ఉపసంపాదకుడు డా.. నొస్సం నరసింహాచార్య పాల్గొన్నారు.
ప్రజామార్గదర్శిని భగవద్గీత పుస్తకాన్ని శ్రీ పాతూరి వేంకటేశ్వరరావు రచించారు. నేటి సమాజానికి భగవద్గీతను అన్వయిస్తూ రాబోయేతరాలకు జీవన మార్గం నిర్దేశించుకోవడంలో భగవద్గీత ఎలా తోడ్పడుతుందో తెలుపుతూ తాతామనవళ్ళ సంభాషారూపంలో ప్రశ్న సమాధానాల రూపంలో తయారు చేయడం ఈ గ్రంథం ప్రత్యేకత.
ఆదిశంకర షణ్మతమ్ (తమిళం) పుస్తకాన్ని శ్రీ కె.ఎస్. సుబ్రహ్మణ్యం రచించారు. ఈ గ్రంథంలో షణ్మతాల పూజావిధానం, షణ్మతాల స్థాపన వివరాలు, శ్రీ శంకరుల జీవిత చరిత్ర మొదలైన విషయాలను సంక్షిప్తంగా తెలియజేశారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికే బ్రహ్మోత్సవ వైభవ్ (హిందీ) పుస్తకాన్ని డా.ఎం.ఆర్.రాజేశ్వరి అనువాదించారు. ఈ గ్రంథంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను కూలంకుశంగా వివరించడంతోపాటు వాహనసేవల ప్రాముఖ్యాన్ని చక్కగా హిందీ భాషలోకి తర్జుమా చేశారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.