GOKULASHTAMI FETE ON AUGUST 19 _ ఆగస్టు 19న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు 

Tirupati, 12 August 2022: TTD is organizing Sri Gokulashtami celebrations at Sri Venkateswara Gosamrakshana Shala on August 19 with Go puja and cultural programs in a grand manner.

 

Elaborate arrangements are underway to resemble the Sri Krishna land at the SV Goshala flower and electrical decorations besides decorating the bovine wealth.

 

TTD also gives the opportunity to devotees to feed jaggery, rice and green fodder to animals as feeding Gomata is hailed auspicious and sacred on this auspicious day.

 

As part of the festivities, Abhishekam will be performed to the statue of Sri Venugopala Swami at the Goshala in the morning followed by devotional cultural events. 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 19న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, 2022 ఆగస్టు 12: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగస్టు 19వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు.

శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను టీటీడీ గోశాలలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తోంది.

సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టీటీడీ శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూలమాలలతో అలంకారాలు చేపట్టనుంది. గోశాలలోని గోసంపదను అందంగా అలంకరించి భూలోక గోకులంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సందర్శకులు గోశాలలో బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల నమ్మకం.

గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు . ఉదయం 6 గంటలకు వేణుగానం, 7.30 గంటలకు వేద పఠనం, 7.30 గంటలకు దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు. అనంతరం శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.

సాయంత్రం 6 గంట‌ల‌కు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.