ఆగస్టు 15, 16వ తేదీల్లో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

ఆగస్టు 15, 16వ తేదీల్లో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, 2017 ఆగస్టు 11: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో ఆగస్టు 15, 16వ తేదీల్లో గోకులాష్టమి వేడుకలు జరుగనున్నాయి.

ఇందులోభాగంగా ఆగస్టు 15న ఉదయం 6 గంటలకు శ్రీ బలరామకృష్ణ స్వామివారికి అభిషేకం, మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణస్వామివారికి ఊంజల్‌సేవ చేపడతారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ, ఆ తరువాత గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఆగస్టు 16న సాయంత్రం 6 గంటలకు ఉట్లోత్సవం, ఆస్థానం చేపడతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.