DISTRICT GETS READY FOR MANAGUDI_ తిరుపతిలో మనగుడికి ఏర్పాట్లు పూర్తి

Tirupati, 11 August 2017: In connection with Gokulastami, the pilgrim district of Chittoor has been geared up to perform Managudi-the prestigious religious programme mulled by TTD from August 12-14 in a big way.

In temple city of Tirupati, this festival will be observed in Rayalacheruvu Rythu Bazaar Sri Venugopala Swamy tempel , MR Palle Sri Krishna Swamy temple for three days with Alaya Sobha, Nagara Sankeertana and Gopuja and Metlotsavam in a big manner.

While in Chittoor, the fest will be celebrated in the temples identified in all 66 mandals.

On the other hand, Gokulastami will be observed in Tiruchanoor Ammavari temple on August 15 with Abhishekam to Sri Balarama Swamy and Sri Krishna Swamy utsavarulu. On the same day evening unjal seva and pedda sesha vahana sevas will be observed. While on August 16 utlotsavam and Asthanam will be observed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుపతిలో మనగుడికి ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2017 ఆగస్టు 11: గోకులాష్టమి పర్వదినం సందర్భంగా ఆగస్టు 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న మనగుడి కార్యక్రమానికి తిరుపతిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతిలోని రాయలచెరువు రోడ్డులోని రైతుబజార్‌ సమీపంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో, ఎంఆర్‌.పల్లిలోని శ్రీకృష్ణ నగర్‌లో గల శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో మనగుడి కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా ఈ రెండు ఆలయాల్లో ఆగస్టు 12న ఉదయం ఆలయ శుద్ధి, ఆగస్టు 13న ఉదయం నగర సంకీర్తన నిర్వహిస్తారు. ఆగస్టు 14న ఉదయం ఎంఆర్‌.పల్లిలోని శ్రీకృష్ణ నగర్‌లో గల శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో గోపూజ, ఉట్లోత్సవం జరుగనున్నాయి.

చిత్తూరు జిల్లాలోని మొత్తం 66 మండలాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 12న ఆలయ శుద్ధి, ఆగస్టు 13న నగర సంకీర్తన నిర్వహిస్తారు. ఆగస్టు 14న కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, జి.డి.నెల్లూరు, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి, నగరి, పుంగనూరు, సత్యవేడు ప్రాంతాల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో గోపూజ, ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.