JANMASTAMI FERVOUR EVERYWHERE IN TIRUPATI_ దేశవాళీ గోజాతుల సంరక్షణకు కృషి : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

Tirupati, 3 September 2018: Devotional fervour touched its peak on Monday as Gokulastami was celebrated in SV Goshala and all temples with aplomb.

Gopuja was performed in Sri Venkateswara Gosamrakshana Sala in Tirupati. TTD Chairman Sri P Sudhakar Yadav and EO Sri Anil Kumar Singhal along with Tirupati JEO Sri P Bhaskar took part in this puja.

Chairman speaking on this occasion said, Krishnavatara happens to be the eighth incarnation of Lord Maha Vishnu. Today Gokulastami is being observed in a big wat across the country and many parts of the world. Our motto is to enhance indigenous breeds of cows, he added.

In his address, EO said a state of art cattle Goshala is coming up in Palamaneru in 450acres. We will develop this in a phrased manner and the board has approved Rs.50crores towards it’s development. He also said the farmers and diary farmers will be oriented on the benefits of Pancha Gavya.

Trust Board member, Sri Challa Ramachandra Reddy, Tirupati JEO Sri P Bhaskar, SV Goshala Director Dr Harinath Reddy, DyEO Smt Varalakshmi were also present.

CULTURAL PROGRAMMES A CYNOSURE

Cultural programmes presented by various artistes, bhajans etc. enthralled everyone.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

దేశవాళీ గోజాతుల సంరక్షణకు కృషి : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

దేశవాళీ గో ఉత్పత్తులపై రైతులకు అవగాహన : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఎస్వీ గోశాలలో ఘనంగా గోకులాష్టమి ‘గోపూజ’

సెప్టెంబరు 03, తిరుపతి, 2018: దేశవాళీ గోవుల జాతులను సంరక్షించి వాటిని వ్యాప్తి చేసేందుకు విశేషకృషి జరుగుతోందని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వెల్లడించారు. దేశవాళీ గోవుల పంచగవ్య ఉత్పత్తులపై అవగాహన కల్పించి రైతులకు లాభదాయకంగా తీర్చిదిద్దుతామని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలియజేశారు. టిటిడికి చెందిన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో సోమవారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్‌, ఈవో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణపరమాత్ముడని, శ్రావణమాసం కృష్ణ పక్షం అష్టమి తిథినాడు శ్రీకృష్ణుడు జన్మించాడని తెలిపారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని హిందువులు కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి పేర్లతో పర్వదినంగా జరుపుకుంటారని, వివిధ రకాల ఫలాలు, అటుకులు, వెన్న, పెరుగు, మీగడ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారని వివరించారు. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకుంటే గోదానం చేసిన ఫలితం వస్తుందన్నారు. భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉందని, గోకులాష్టమి సందర్భంగా ప్రతి ఏటా గోశాలలో ‘గోపూజ మహోత్సవం’ నిర్వహిస్తున్నామని చెప్పారు. గోశాలలో 2 వేలకు పైగా గోవులను సంరక్షిస్తున్నామని తెలిపారు. గోపూజ చేయడం వల్ల పాడిపంటలు వ ద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ భక్తులకు గోపూజ ప్రాశస్త్యాన్ని తెలియజేయడంతోపాటు దేశవాళీ గోవుల వల్ల కలిగే ప్రయోజనాలు, పంచగవ్య ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించి గోవుల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు రూ.3 కోట్లతో ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. పలమనేరులో ఆధునిక వసతులతో 450 ఎకరాల్లో గోశాల ఏర్పాటు చేస్తున్నామని, రానున్న ఐదేళ్లు, పదేళ్లలో దశలవారీగా రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ గోశాలలో 990 గోవులు ఉన్నాయని, మరో 1200 గోవులను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. 2002లో గోసంరక్షణ ట్రస్టు ఏర్పాటైందని, ఈ ట్రస్టు ద్వారా తిరుమల శ్రీవారి ఆలయం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర ఆలయాల్లో నిత్యం సంప్రదాయబద్ధంగా గోపూజ నిర్వహిస్తున్నామన్నారు. ప్రయివేటు గోశాలలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి గోశాల నుండి టిటిడి ఆలయాలకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సరఫరా చేస్తున్నారని, ఉత్సవాల సమయంలో ఏనుగులు, గుర్రాలు, వృషభాలను పంపుతున్నారని తెలియజేశారు.

గోపూజ మహోత్సవంలో భాగంగా ఉదయం శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, వేణుగానం, ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం, భజనలు, కోలాటం, అన్నమాచార్య సంకీర్తనాలాపన నిర్వహించారు. గోవులకు పూజ చేసిన అనంతరం శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో పూజలు చేసి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయంత్రం హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో హరికథ వినిపిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీచల్లా రామచంద్రారెడ్డి, గోశాల సంచాలకులు డా|| కె.హరనాథరెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీమతివరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.