GOKULASTAMI CELEBRATED WITH RELIGIOUS FERVOUR IN TIRUMALA_ తిరుమలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

Tirumala, 3 September 2018: The Gokulastami Celebrations in Tirumala enthused everyone on Monday.

In Gogarbham Gardens, Special Abhishekam was performed to Kaliya Mardana Krishna by the Garden Wing of TTD. The Garden Superintendent Sri Srinivasulu took part in this fete.

Later Utlotsavam was also observed in the premises where enthousiastic youth took part in the mud pot breaking fete.

In the evening, Gokulastami Astanam was performed at Bangaru Vakili inside Tirumala temple. The pundits read out Sri Krishna Jananam episodes and later prasadams were distributed. This fete took place between 8pm and 10pm.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

సెప్టెంబరు 03, తిరుమల, 2018: తిరుమలలో సోమవారంనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8 నుండి 10 గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపడతారు.

కాగా, సెప్టెంబరు 4న మంగళవారం తిరుమలలో సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారు. ఈ కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.