GOKULASTAMI CELEBRATIONS AT SV GOSALA IN TIRUPATI ON AUGUST 30 _ ఆగ‌స్టు 30న ఎస్వీ గోశాలలో గోకులాష్టమి ‘గోపూజ’

TIRUPATI, 28 AUGUST 2021: The Sri Krishna Janmashtami festival will be observed with religious fervour at SV Gosamrakshanasala at Tirupati on August 30 in adherence to Covid guidelines.

On that auspicious day, there will be abhishekam to Sri Venugopala Swamy located in the SV Dairy farm followed by Gopuja Mahotsavam at 10:30am. 

All the cattle will be specially decorated for the occasion in a traditional manner and the entire premises will be spruced up to celebrate the festival with spiritual ecstasy. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 30న ఎస్వీ గోశాలలో గోకులాష్టమి ‘గోపూజ’

తిరుప‌తి, 2021 ఆగ‌స్టు 28: తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగ‌స్టు 30న సోమవారం గోకులాష్టమి గోపూజ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్రమం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం 10.30 గంటలకు ‘గోపూజ మహోత్సవం’ జరుగనుంది. ఆ తరువాత శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో పూజ, హారతి ఇస్తారు.

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. గోపూజ‌ వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని భ‌క్తుల నమ్మకం. ఈ సంద‌ర్భంగా గోవుల‌ను ప్ర‌త్యేకంగా అలంక‌రించి అర్చ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.