GOKULASTAMI CELEBRATIONS IN TIRUMALA ON AUGUST 15_ తిరుమలలో గోకులాష్టమి వేడుకలకు సన్నద్ధమవుతున్న తి.తి.దే
Tirumala, 8 August 2017: In connection with the festival of Gokulastami on August 15, Hill town of Tirumala is gearing up to celebrate the festival with utmost fervour.
As a part of this fest, special abhishekam will be performed in Gogarbham Dam gardens to Kaliya Mardana Krishna Statue followed by Utlotsavam between 11am and 1pm.
Meanwhile Asthanam will be observed in Tirumala temple on August 15 between 8pm and 10pm and Utlotsavam on August 16 in Tirumala with religious ecstasy.
TTD is making elaborate arrangements for the festival.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుమలలో గోకులాష్టమి వేడుకలకు సన్నద్ధమవుతున్న తి.తి.దే
తిరుమల, 08 ఆగస్టు 2017: ఈ నెల 15వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని అందుకు తగిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తి.తి.దే సన్నద్ధమవుతోంది. కాగా ఆరోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుమలలోని పాపవినాశనం మార్గంలోనున్న గోగర్భం ఉద్యానవనాలలో కాళీయమర్థనుని విగ్రహానికి ప్రత్యేక అభిషేకం మరియు ఉట్లోత్సవాన్ని ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహిస్తారు. అదే రోజు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత రాత్రి 8 గంటల నుండి 10 గంటల నడుమ గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
కాగా అగస్టు 16వ తేదిన ఉట్లోత్సవాన్ని తిరుమల నాలుగు మాడ వీధులలో నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో తి.తి.దే ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.