TIRUMALA TEMPLE REOPENS_ శ్రీవారి ఆలయంలో ఉదయం 3.30 గం||ల నుండి భక్తులకు దర్శనం

Tirumala, 8 August 2017: Following lunar eclipse on August 7, the main doors of Tirumala temple were closed on Monday evening at 4:30pmwere reopened on Tuesday by 2am.

The temple priests performed Punyahavachanam and Suddhi before commencing pre-dawn rituals to the presiding deity of Lord Venkateswara.

After observing Suprabhatam, Thomala, Archana, Koluvu and Asta Dala Pada Padmaradhana, the devotees are allowed for sarva darshanam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఉదయం 3.30 గం||ల నుండి భక్తులకు దర్శనం

తిరుమల, 2017 ఆగస్టు 08: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 3.30 గంటల నుంచే సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఆగస్టు 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని మూసివేసిన విషయం విదితమే.

మంగళవారం వేకువజామున 2 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, అష్టదళ పాదపద్మారాధన అనంతరం నిర్దేశించిన సమయానికంటే ముందుగానే భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.