ఆగస్టు 15న కపిలితీర్ధంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

ఆగస్టు 15న కపిలితీర్ధంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, 2017 ఆగస్టు 10: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 15వ తేదీ గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.00 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారికి వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఆనంతరం ఆలయంలో ఆస్థానంతో గోకులాష్టమి ఉత్సవం ముగుస్తుంది. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.