ఆగస్టు 12న తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం

ఆగస్టు 12న తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం

తిరుపతి, 2017 ఆగస్టు 10: టిటిడి హిదూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో 34వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆగస్టు 12వ తేదీ బహుమతులు ప్రదానం చేయనున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం ఉదయం 10.00 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో 34వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన ఆరు మంది విద్యార్థులకు, చెన్నై, చిత్తూరు జిల్లా ర్యాంకర్లు 12 మందికి బహుమతులు ప్రధానం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలలోని ఇతర జిల్లా ర్యాంకర్లకు ఆయా జిల్లా కేంద్రాలలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కేంద్రాల ద్వారా బహుమతి ప్రదానం చేయనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.