GOLDEN ARMOUR READORNED TO LORD_ వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు

Tirumala, 26 June 2018: The annual Jyestabhishekaam concluded on a grand religious note on Tuesday in Tirumala temple.

The Snapana Tirumanjanam was performed to the deities in Kalyanotsava Mandapam which provided a cynosure to the devotees who took part in the fete.

Later the swarna kavacham which is to be adorned to deities was rendered special puja before it is adorned to the deities.

In the evening Swarna Kavacha Samarpana took place in a religious manner. The Lord Malayappa Swamy took celestial ride wearing Swarna Kavacham and blessed the devotees. The processional deities will be seen the same golden armour till Jyestabhishekaam next year.

TTD Chairman Sri Putta Sudhakar Yadav, TTD EO Sri Anil Kumar Singhal, Sri Bonda Umamaheswara Rao, Sri GSS Sivaji, Sri Dokka Jagannadham, Sri Potluri Ramesh Babu, Sri Sandra Venkata Veeraiah, Smt Sudha Narayanamurthy, Sri Rudra Raju Padma Raju, Sri Meda Ramakrishna Reddy, Endt Commissioner Smt Anuradha, Spl Invitees Sri N Sri Krishna, Sri B Ashok Reddy, JEOs Sri KS Sreenivasa Raju and others took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు

జూన్‌ 26, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం మంగళవారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునర్‌ దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం నూతన స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి, అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు, శ్రీ జిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీ డొక్కా జగన్నాథం, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, శ్రీ సండ్ర వెంకటవీరయ్య, శ్రీమతి సుధానారాయణమూర్తి, శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ శ్రీమతి అనూరాధ, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ ఎన్‌.శ్రీకృష్ణ, శ్రీ బి.అశోక్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.