GOLDEN KAVACHAM REMOVED FROM MALAYAPPA_ శ్రీవారి ఆలయంలో ఉత్స‌వ‌మూర్తుల‌కు శాస్త్రోక్తంగా కవచాల‌ తొలగింపు

Tirumala, 11 Jun. 19: The Golden Kavacham adorned to Sri Malayappa Swamy was removed on Tuesday in Tirumala temple.

After the second bell, the Swarna Kavacham on Sri Malayappa Swamy was removed amidst chanting of vedic mantras in Ranganayakula Mandapam.

The same will be adroned to Lord Malayappa on June 16.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, DyEO Sri Harindranath, Peishkar Sri Lokanatham were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఉత్స‌వ‌మూర్తుల‌కు శాస్త్రోక్తంగా కవచాల‌ తొలగింపు

తిరుమల, 2019 జూన్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారి ఉత్సవమూర్తులకు కవచం తొలగింపు కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రెండో గంట తరువాత రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సంవత్సరం పొడవునా అభిషేకాది క్రతువుల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు కవచాలను తొలగించి శుద్ధి చేస్తారు. సాధార‌ణంగా జ్యేష్ఠాభిషేకానికి ముందు మంగ‌ళ‌వారం క‌వ‌చాల‌ను తొల‌గించి అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేస్తారు.

జూన్ 14వ తేదీన జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా మొదటిరోజు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచం, రెండో రోజు ముత్యాలకవచం, మూడో రోజు తిరిగి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.