CS OF AP OFFERS PRAYERS GODDESS PADMAVATHI_ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం

Tiruchanoor, 11 Jun. 19: The Chief Secretary of Andhra Pradesh Sri LV Subramanyam along with his family members offered prayers to Goddess Padmavathi in Tiruchanoor on Tuesday.

On his arrival at temple Tirupati JEO Sri B Lakshmikantham, Temple DyEO Smt Jhansi Rani and temple priests welcomed him with temple honors. After darshan of the Goddess Tirupati JEO presented Ammavari Prasadam.

Tirumala JEO Sri KS Sreenivasa Raju and Dist Officials were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం

తిరుప‌తి, 11 జూన్‌, 2019: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని మంగ‌ళ‌వారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం దర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం మీడియాతో మాట్లాడుతూ వ‌ర్షాలు కురిసి పాడిపంట‌లు, ప‌శుప‌క్ష్యాదుల‌తో రాష్ట్రం స‌స్య‌శ్యామ‌లంగా ఉండాల‌ని అమ్మ‌వారిని ప్రార్థించాన‌న్నారు. అంద‌రూ ధ‌ర్మ‌బ‌ద్ధంగా ఉండాల‌ని కోరారు. ప్ర‌జ‌లంద‌రూ సుఖసంతోషాల‌తో ఉండాల‌ని, అంద‌రిపైనా అమ్మ‌వారి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకున్న‌ట్టు చెప్పారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శేషవస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సెట్విన్ సిఈవో శ్రీ‌మ‌తి శ్రీ‌ల‌క్ష్మీ, ఎవిఎస్‌వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.