GOLDEN UMBRELLAS OFFERED PRAYERS IN TIRUMALA _ బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవం

Tirumala, 6 October 2019: As a part of the ongoing annual Brahmotsavams at Tirumala, the traditional event of offering prayers to the golden umbrella was conducted in a grand way on Sunday evening.

TTD Executive officer Sri Anil Kumar Singhal and addl EO Sri AVDharma Reddy , Tirupati Joint executive officer Sri P Basant Kumar along with CVSO Sri Gopinath Jatti participated in the customary festival held ahead of the fabulous Rathotsavam which will be observed on October 7,  wherein the hereditary barbers of Kalyana Katta belonging to Pantulu family presented a golden  umbrella to adorn the  massive wooden Ratham.

Speaking on the occasion, Additional EO Sri Dharma Reddy said from the days of Srinivasa Mahadevaraya, king of Chandragiri, the Pantulu family was given right to present an umbrella on the penultimate day event of the Rathotsavam since 1952.

Pantulu Sri Ramanathan made the customary offering. DyEO of Kalyana Katta Smt Nagaratna, AEO Sri Jagannathachari and other staffs participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవం

తిరుమల, 2019 అక్టోబరు 06:  తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం ఆదివారం సాయంత్రం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి. బసంత్ కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాధ్‌జెట్టి పాల్గొన్నారు. అక్టోబ‌రు 6వ తేదీ సోమ‌వారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకుని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు.

 ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాసమహదేవరాయలు చేసిన ధర్మ శాసనం ప్రకారం పంతులుగారి వంశస్థులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారని తెలిపారు.  తొలిరోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై, ఆటు తరువాత 1952 నుండి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతుందన్నారు. 
       

కాగా పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన శ్రీ రామనాథన్‌ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం తిరుమలలో నిర్వహించారు.

కల్యాణకట్ట డెప్యూటి ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, ఇతర అధికారులు,  సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.