GOOD RESPONSE TO TTD ONLINE BOOKING OF SED -TTD ADDITIONAL EO _ ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌కు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న

ONE CRORE HITS FOR 2.40LAKH TICKETS

 

TIRUMALA, 24 SEPTEMBER 2021: The special drive to improve the TTD online booking website environment has given good dividends stated TTD Additional EO Sri AV Dharma Reddy.

 

In a media briefing held at Annamaiah Bhavan on Friday in Tirumala, the Additional EO explained in detail about the technical snags encountered and the efforts of TTD IT wing along with TCS and JIO to overcome these issues. The details as stated below:

 

Several technical hiccups have surfaced since lakhs of devotees are making simultaneous logins to book the limited number of SED tickets released in on-line during Covid environment.

 

Following the complaints of technical issues from the pilgrims during the Special Entry Darshan Quota release for the months of August and September, the IT wing of TTD with the help of TCS explored all the technical possible solutions to overcome these performance issues.

 

The team explored many alternatives including Amazon, Jio, Bookmyshow, Abhibus etc. Which has a powerful Cloud Management System.

 

M/s Jio is selected as the best choice as they have come forward to address the technical issue free of cost. As a service to Venkateswara Swamy M/s, Jio has taken this as a challenge to meet the expectations of the pilgrim in providing best possible booking experiences. Jio with about 30 highly qualified technical team worked 24X7 for the past 22 days to develop a new web portal in AWS environment and made it ready for quota release on 24th of September.

 

The app developed is thoroughly tested to ensure Security and Performance. New Payment gateways were introduced. Required physical cloud infrastructure provided by Jio at no cost to TTD includes software development worth around Rs.3crore along with necessary infrastructure support.

 

The pilgrims were redirected to the Jiomart sub-domain from tirupatibalaiji.ap.gov.in website. The sub-domain under the TTD name could not be created due to time and technical constraints. From next month’s release onwards, jiomart will not appear and the domain name will be tirupaitbalaji.ap.gov.in only.

 

The quota was released exactly at 9 AM on Friday. Because of the newly developed application and the fresh environment and due to sudden increase in the load to 5.5 Lakhs users from 1.06 lakh users observed during last release, the application experienced some technical issues till 10:30 AM.

 

The Jio team, TCS and TTD IT Team together addressed the technical issue within one and a half hours and the services resumed by 10:30 AM. About 5.5 lakh users tried to book the tickets at any point of time and more than one crore hits were received on the TTD Booking portal. Even then the application has served with good performance by the team efforts and quality infrastructure provided by the Jio. The bookings were smooth and users experienced the best booking process. Within one hour 2. 4 lakh tickets were booked successfully and the total hits touched one crore mark today.

 

TTD is appealing to devotees not to be carried away by any malicious campaign by vested elements. Since 2016 the technical support is offered to TTD by private firms only. Control S systems offered us technical support on payment of Rs60lakhs per year. Later TCS has come forward to offer technical support. But due to heavy pilgrim hits on limited number of tickets, the servers offered by these companies have no capacity to tackle. There are only a few companies which own Cloud Management system that have huge data control network. Jio is one among them which has offered us technical and Infrastructure free of cost.

 

Creating unnecessary confusion among devotees and playing with their sentiments with baseless rumours by some vested interests is seriously condemned. We are repeatedly appealing to devotees not to fall in the trap of such rumours and continue to book tickets on the TTD official website only”, the Additional EO reiterated.

 

TTD IT Chief Sri Sesha Reddy, CIO Sri Sandeep Reddy and other IT staff were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌కు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న

– సామాజిక మాధ్య‌మాల్లో దుష్ప్ర‌చారం చేసిన వారిపై చ‌ర్య‌లు

– టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 24: మొద‌టిసారి క్లౌడ్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించి టిటిడి విడుద‌ల చేసిన అక్టోబ‌రు నెల కోటా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌కు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భించింద‌ని, ఒకటిన్న‌ర‌ గంట వ్య‌వ‌ధిలోనే 2.39 ల‌క్ష‌ల టికెట్ల‌ను భ‌క్తులు బుక్ చేసుకున్నార‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌లో ఎదురైన సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను టిటిడి ఐటి విభాగం, టిసిఎస్‌, జియో సంస్థ‌ల నిపుణులు అధిగ‌మించిన విధానాన్ని కూలంక‌షంగా తెలియ‌జేశారు. కోవిడ్ స‌మ‌యంలో ప‌రిమిత సంఖ్య‌లో విడుద‌ల చేస్తున్న ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌కు భ‌క్తుల నుండి తీవ్ర‌మైన డిమాండ్ ఎదురైంద‌న్నారు. గ‌తంలో కంట్రోల్ ఎస్‌, ఎపిటిఎస్ సంస్థ‌ల ద్వారా ఫిజిక‌ల్ స‌ర్వ‌ర్ల సాయంతో ద‌ర్శ‌న టికెట్ల జారీ జ‌రిగేద‌ని, అయితే, అప్ప‌ట్లో స‌మ‌యం ఎక్కువ‌గా ఉండ‌డంతో భ‌క్తులు త్వ‌ర‌ప‌డ‌కుండా టికెట్ల‌ను బుక్ చేసుకునే వారని వివ‌రించారు. ఆ త‌రువాత కాలంలో ప‌రిమితంగా జారీ చేసిన ద‌ర్శ‌న టికెట్ల కోసం ఎక్కువ మంది భ‌క్తులు ఒకేసారి ద‌ర్శ‌న టికెట్ల కోసం ప్ర‌య‌త్నించ‌డం మొద‌లైంద‌న్నారు. దీనివ‌ల్ల ఆగ‌స్టు, సెప్టెంబ‌రు నెల‌ల్లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదురైన‌ట్టు చెప్పారు. వీటిని టిటిడి ఐటి విభాగం, టిసిఎస్ సంస్థ‌ల స‌హ‌కారంతో ప‌రిష్క‌రించామ‌న్నారు. అయితే ఇలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు పున‌రావృతం కాకుండా ప‌లు మార్గాల‌ను అన్వేషించామ‌ని, ఇందులో భాగంగా క్లౌడ్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌ను వినియోగించుకునేందుకు అమెజాన్‌, జియో, బుక్ మై షో, అభిబ‌స్ లాంటి సంస్థ‌ల‌ను సంప్ర‌దించామ‌ని వివ‌రించారు.

వీరిలో జియో సంస్థ ఉచితంగా క్లౌడ్ సేవ‌ల‌ను అందించేందుకు ముందుకొచ్చింద‌ని తెలిపారు. భ‌క్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ద‌ర్శ‌న టికెట్ల‌ను బుక్ చేసుకునేందుకు జియో సంస్థ 30 మంది ఉన్న‌త‌స్థాయి సాంకేతిక నిపుణుల‌ను ఎంపిక చేసింద‌ని, వీరు 22 రోజుల పాటు 24/7 శ్ర‌మించి జియో క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో టికెట్లు విడుద‌ల చేశార‌ని చెప్పారు. మొద‌ట్లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింద‌ని, వెంట‌నే జియో సంస్థ నిపుణులు, టిసిఎస్‌, ఐటి విభాగం సిబ్బంది స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించార‌ని వివ‌రించారు. అయితే tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో స‌మ‌యాభావం వ‌ల్ల జియో మార్ట్ స‌బ్ డొమైన్ వినియోగించాల్సి వ‌చ్చింద‌న్నారు. వ‌చ్చే నెలలో పూర్తిగా టిటిడి డొమైన్‌లోనే ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. ద‌ర్శ‌న టికెట్ల కోసం ఒకే స‌మ‌యంలో 5.5 ల‌క్ష‌ల మంది ఆన్‌లైన్‌లో ప్ర‌య‌త్నించార‌ని, మొత్తంగా టిటిడి వెబ్‌సైట్‌కు ఒక కోటికి పైగా హిట్స్ వ‌చ్చాయ‌ని తెలియ‌జేశారు. శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు రోజుకు 8 వేలు చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఇందులో ఎలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా టిటిడి ఐటి విభాగం, జియో నిపుణులు, టిసిఎస్ నిపుణుల‌తో ఈ రోజు వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హిస్తామ‌న్నారు.

సామాజిక మాధ్య‌మాల్లో దుష్ప్ర‌చారం చేసిన వారిపై చ‌ర్య‌లు

వాస్త‌వాలు తెలుసుకోకుండా టిటిడి ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్ వ్య‌వ‌స్థ‌ను జియో సంస్థ‌కు అప్ప‌గించింద‌ని కొన్ని ఛాన‌ళ్లు, సామాజిక మాధ్య‌మాల్లో దుష్ప్ర‌చారం చేశార‌ని, ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని అద‌న‌పు ఈవో భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. దుష్ప్ర‌చారం చేసిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. టిటిడి భ‌క్తుల‌కు టికెట్ల జారీ ప్ర‌క్రియను ఎంతో పార‌దర్శ‌కంగా అమ‌లుచేస్తుండ‌గా, కొంత‌మంది అదేప‌నిగా సంస్థ ప్ర‌తిష్ట‌కు భంగం వాటిల్లేలా వివిధ మాధ్య‌మాల‌లో అవాస్త‌వాలు ప్ర‌చారం చేయ‌డం మంచిది కాద‌ని ఆయ‌న అన్నారు.

మీడియా స‌మావేశంలో టిటిడి ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, చీఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్ శ్రీ సందీప్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.