GOPUJA WALL POSTERS RELEASED BY JEO _ గోకులాష్టమి వేడుకల గోడపత్రికలను ఆవిష్కరించిన జెఈవో

Tirupati, 11 August 2017: In connection with Gokulastami celebrations in Sri Venkateswara Goshala at Tirupati on August 15, Tirupati JEO Sri P Bhaskar has released the posters related in connection with the fete on Friday in his chambers in TTD Administrative building in Tirupati.

As a part of “Managudi” program, Gokulastami will be observed in a big way with Gopuja in Goshala premises. TTD will be observing Gopuja in 294 towns present across two Telugu states on August 15.

SV Dairy Farm Director Dr Harnath Reddy, TTD PRO Dr T Ravi were also present during the poster release.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

గోకులాష్టమి వేడుకల గోడపత్రికలను ఆవిష్కరించిన జెఈవో

తిరుపతి, 2017 ఆగస్టు 11: టిటిడి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగస్టు 15వ తేదీన నిర్వహించే గోకులాష్టమి వేడుకల గోడపత్రికలను శుక్రవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకం, ఉదయం 6 గంటలకు వేణుగానం, ఉదయం 6.30 గంటలకు వేద పఠనం, ఉదయం 7.30 గంటలకు టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకు శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ గోశాల డైరెక్టర్‌ డా|| కె.హరనాథరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.