GOSHALA SHOULD BE MADE A PART OF TIRUMALA PILGRIMAGE-TTD EO_భక్తులు గోశాలను సందర్శించేలా ఏర్పాట్లు చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 16 Feb. 18: Wide publicity on the importance of Gomata should be given so that every pilgrim including VIPs, pontiffs should include SV Goshala as a part of their pilgrimage, said TTD EO Sri Anil Kumar Singhal.

A review meeting on activities of Go Samrakshana Trust took place in the Chambers’ of EO in TTD administrative building in Tirupati on Friday.

The EO directed Goshala Director Dr Harnath Reddy to come out with a concrete action plan to ensure how best the cow based natural products as there is a lot of marketing scope for enriched bio manure in agriculture in many districts of AP.

DISTRIBUTE PAMPHLETS ON IMPORTANCE OF GOMATA TO DEVOTEES

The EO directed the concerned officials to give wide publicity on importance of Gomata and distribute pamphlets to the multitude of visiting pilgrims. “Also prepare a documentary on the significance of Gomata, Gosamrakshana Trust in SVBC for global pilgrims”, he added.

DEVELOPMENT WORKS FROM TRUST FUNDS

He directed the Goshala officials to develop infrastructure for Tirupati and Palamaner Goshalas and take up the construction of platforms in these Goshalas from the funds of Gosamrakshana trust. “For future developmental works an experts team shall be deployed which will submit a report on the requirements of infrastructure for Palamaner Goshala.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, FACAO Sri O Balaji, Dr Nalini Kumari, Prinicipal SV Veterinary College, Dr Rajeswari Devi, Principal SV Agriculture College and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తులు గోశాలను సందర్శించేలా ఏర్పాట్లు చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఫిబ్రవరి 16, తిరుపతి, 2018తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరూ తిరుపతిలోని గోశాలను సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో కార్యాలయంలో శుక్రవారం ఎస్వీ గోసంరక్షణ ట్రస్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోశాలను సందర్శించేందుకు స్వామీజీలు, ప్రముఖులను ఆహ్వానించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సేంద్రియ ఎరువులు, పంచగవ్య ఉత్పత్తులకు డిమాండ్‌ ఉందని, వీటిని మార్కెట్‌ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని గోశాల సంచాలకులు డా|| హరనాథరెడ్డిని ఆదేశించారు. గోమాత విశిష్టతపై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కరపత్రాలను ముద్రించి తిరుమలలో భక్తులకు పంపిణీ చేయాలని, డాక్యుమెంటరీ రూపొందించి ఎస్వీబీసీలో ప్రసారం చేయాలని సూచించారు. తిరుపతి, పలమనేరులో ఉన్న గోశాలల్లో గోవులకు సౌకర్యవంతంగా ప్లాట్‌ఫారాలు నిర్మించాలని ఆదేశించారు. గోసంరక్షణ కార్యకలాపాల కోసం ట్రస్టు నిధులను వినియోగించాలన్నారు. పలమనేరు గోశాలకు నిపుణులను ఆహ్వానించి మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం చేయించి నివేదిక రూపొందించాలని సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుపతి ఇన్‌చార్జి జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఎస్వీ పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డా|| నళినికుమారి, ఎస్వీ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డా|| రాజేశ్వరిదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.