GOVERNOR VISITS VONTIMITTA TEMPLE_ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్.నరసింహన్
Vontimitta, 28 February 2019: The Honourable Governor of Telugu states His Excellency Sri ESL Narasimhan along with his spouse Smt Vimala Narasimhan visited the historic Sri Kodanda Rama Swamy temple at Vontimitta on Thursday morning and performed special pujas.
Earlier the first couple of the state were given traditional Purna Kumbha reception by the TTD JEO for Tirupati, Sri B Lakshmikantham at the temple Maha Dwaram. After darshan, the temple Archakas offered Sesha vastram and Vedasirvachanams to the Governor. At the mandapam the JEO presented Srivari thirtha prasadams.
Kadapa District collector Sri Hari Kiran, Joint Collector Sri P Koteshwar Rao, SP Sri Rahul Dev Sharma, Rajampeta RDO Sri Kodandarami Reddy, TTD VGO Sri Ashok Kumar Gowd, Temple DyEO Sri Natesh Babu, AEO Sri Ram Raju and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్.నరసింహన్
ఒంటిమిట్ట, 2019 ఫిబ్రవరి 28: తెలుగు రాష్ట్రాల గవర్నర్ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్.నరసింహన్ గురువారం ఉదయం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ముందుగా ఆలయానికి చేరుకున్నగౌ|| గవర్నర్ దంపతులకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, ఆలయ అర్చక బృందం కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు శేషవస్త్రం బహుకరించి, వేదశీర్వా చనం అందించారు. అనంతరం ఆలయ మండపంలో గౌ|| గవర్నరు దంపతులకు జెఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కడప కలెక్టర్ శ్రీ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ శ్రీ పి. కోటేశ్వర రావు, ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ, రాజంపేట ఆర్డీవో శ్రీ కోదండరామి రెడ్డి, టిటిడి విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, ఏఈవో శ్రీ రామరాజు, ఇతర తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.