GOVINDA A PROTECTOR OF VEDAS- SHARADA PEETHAM PONTIFF _ వేద పోషకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి :విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి
Tirumala, 20 Dec. 19: Pontiff of Vizag Sharada Peetham Sri Sri Sri Swaroopanandendra swami on Friday said that Lord Venkateswara was both guardian and propagator of Vedas.
He was addressing a Veda sadassu organized by the TTDs SV Higher Vedic studies Institute on Friday evening at the at Sharada peetham in Tirumala.
Earlier the students of Veda Pathashala at Dharmagiri, Faculty of SV Vedic University and TTD pundits recited Veda Parayanas on the occasion
Presenting his blessing speech the Swamiji lauded the efforts of TTD in the protection and propagation of Veda studies and said only the spread of the message of Vedas would usher in prosperity and peace in society and universe. He urged the TTD Veda pundits to daily take up Veda Narayana’s without fail at Tirumala. The Sharada Peetham will henceforth conduct dharmic events like Agni-hotra sabhas and spiritual debates at Tirumala to spread the message of Sanatana Hindu dharma.
Earlier the designate Peethadhipathi of Sharada peetham Sri Sri Sri Swatmanandendra Saraswati Swami performed special pujas for Goddess Sharada.
TTD Additional EO Sri Dharma Reddy, Special Officer of the SV Higher Vedic studies institute Dr. Akella Vibhisana Sharma and numerous Veda parayanadars participated in the event.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. లోకం సుభిక్షంగా ఉండాలంటే వేదాల సారాన్ని వ్యాప్తి చేయాలన్నారు. వేదపరిరక్షణ కోసం టిటిడి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వేదపండితులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వేదపారాయణం చేయాలని సూచించారు. హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం శారద పీఠం తరఫున శాస్త్రసభలు, అగ్నిహోత్ర సభలతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అంతకుముందు శారద పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ శారద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, వేదపారాయణదారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.