GOVINDA RAKSHA KANKANAMS TO GET DIVINE BLESSINGS ON NOV 24_ నవంబరు 24న మనగుడి ‘గోవిందరక్ష’ కంకణాలకు శ్రీవారి ఆశీర్వాదం

Tirumala, 22 November 2017: The “Managudi” Sare including Govinda Raksha Kankanams and other puja materials will be placed at the divine fete of Lord Venkateswara on November 24 before being dispatched to the temples located in AP and TS.

Managudi-the mass temple festival, a prestigious programme commenced by TTD about five years with the support of Endowments Department. It will be observed from December 1 to 3 in the holy month of Karthika this year across 300 temples located in both Telugu speaking states.

On December 1, there will be “Alaya Sobha”, while on the second day “Krittika Deepotsavam” will be observed in all these notified temples. In connection with Datta Jayanthi on December 3, “Guru Pooja” will be celebrated in a big way.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

నవంబరు 24న మనగుడి ‘గోవిందరక్ష’ కంకణాలకు శ్రీవారి ఆశీర్వాదం

తిరుమల, 2017 నవంబరు 22: డిసెంబరు 1 నుండి 3వ తేదీ వరకు నిర్వహించనున్న మనగుడి ఉత్సవానికి సంబంధించి టిటిడి సిద్ధం చేసిన గోవిందరక్ష కంకణాలతో పాటు ఇతర పూజాసామగ్రిని నవంబరు 24వ తేదీ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 300 ఆలయాలలో ”మనగుడి” కార్యక్రమం ఘనంగా జరుగనుంది.

ఇందులో భాగంగా అక్షింతలు, పసుపుకుంకుమ, కలకండ, పుస్తక ప్రసాదం, ‘గోవిందరక్ష’ కంకణాలతో కూడిన పూజాసామగ్రిని శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం మనగుడి పూజాసామగ్రిని ఎంపిక చేసిన ఆలయాలకు చేరుస్తారు.

డిసెంబరు 1న ఆలయశోభ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో గుడి పరిసరాలను శుభ్రం చేసుకుని, రంగవళ్లులతో అందంగా అలంకరించుకోవడం, డిసెంబరు 2న కృత్తిక దీపోత్సవం, నగర సంకీర్తన, స్థానిక భజన బృందాలతో భజన కార్యక్రమాలు నిర్వహించడం, డిసెంబరు 3వ తేదీ దత్తజయంతిని పురస్కరించుకుని గురు పూజ నిర్వహిస్తారు.

అదేవిధంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నవంబరు 29, 30వ తేదీకల్లో గీతాజయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. నవంబరు 29వ తేదీన 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు భగవద్గీతపై పోటీలు నిర్వహిస్తారు. నవంబరు 30న భగవద్గీతపై సదస్సులు, చర్చా కార్యక్రమాలు చేపడతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.