TTD EO LAUNCHES TAMIL WEBSITE_ భక్తులకు అందుబాటులోకి టిటిడి వెబ్‌సైట్‌ తమిళ వర్షన్‌ : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 22 November 2017: After successfully launching Telugu and Kannada websites, TTD has launched its Tamil Version on Wednesday.

TTD EO Sri Anil Kumar Singhal officially launched the website in Tamil in his chambers in TTD administrative building to facilitate the pilgrims to book Srivari online services including accommodation, darshan etc.

Speaking on this occasion, TTD EO said, the official website of TTD in Telugu was launched on September 23 while the Kannada Version on November 1. “It will facilitate not only devotees of Lord Venkateswara within the country but also abroad to book seva and accommodation tickets online and also make donations through e-Hundi”, he added.

GOVINDA APP WORKS SHOULD COMPLETE BY DECEMBER

TTD EO also instructed the IT wing of TTD to complete the Govinda App software by December in co-ordination with TCS team. He also directed the Special Officer Sri N Muktheswara Rao and PRO Dr T Ravi to upload the necessary information in the app that is useful for pilgrims from time to time. He also suggested that relevant photos with respect to Annaprasadam, health, accommodation should be placed in website along with statistics to have a better view to the netizens.

TTD IT Wing chief Sri Sesha Reddy, Chief Information Officer Sri Sudhakar, TCS team Sri Bhimsekhar, Sri Satya were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

భక్తులకు అందుబాటులోకి టిటిడి వెబ్‌సైట్‌ తమిళ వర్షన్‌ : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

నవంబరు 22, తిరుపతి, 2017: శ్రీవారి సేవలు, బస తదితర సేవలను బుక్‌ చేసుకునేందుకు ఉద్దేశించిన ttdsevaonline.com వెబ్‌సైట్‌ తమిళ వర్షన్‌ను బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇది లక్షలాది మంది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 23న శ్రీవారి బ్రహ్మూెత్సవాల ధ్వజారోహణం నాడు టిటిడి వెబ్‌సైట్‌ తెలుగు వర్షన్‌ను, నవంబరు 1న కన్నడ వర్షన్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ వెబ్‌సైట్‌లో శ్రీవారి ఆర్జితసేవల ఎలక్ట్రానిక్‌ డిప్‌, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదులు, కల్యాణవేదిక బుక్‌ చేసుకోవచ్చన్నారు. టిటిడి ప్రచురణలను చదువుకోవడంతోపాటు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, శ్రీవారి హుండీకి కానుకలు, ట్రస్టులకు విరాళాలు, కాటేజి విరాళాలు అందించవచ్చని వివరించారు.

ఇడిపి విభాగంపై ఈవో సమీక్ష :

అనంతరం ఇడిపి విభాగంపై ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా టిసిఎస్‌ అధికారి శ్రీ భీమశేఖర్‌ గత నెలలో ఐటి విభాగం, టిసిఎస్‌ కలిసి పూర్తి చేసిన అసైన్‌మెంట్లను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఈవోకు వివరించారు. భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న గోవింద మొబైల్‌ యాప్‌లో టిటిడి సంక్షిప్త సమాచారాన్ని పొందుపరుస్తున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ డిసెంబరు నెలాఖరు నాటికి గోవింద మొబైల్‌ యాప్‌నకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ పనులు పూర్తి చేయాలన్నారు. తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, పిఆర్‌వో డా|| టి.రవి కలిసి మొబైల్‌ యాప్‌లో టిటిడి సమగ్ర సమాచారాన్ని సంక్షిప్తంగా పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి వెబ్‌సైట్‌ హోం పేజిలో శ్రీవారి వివిధ అలంకరణల ఫొటోలను ఎక్కువసేపు ఉంచాలని, తద్వారా ఎక్కువ మంది భక్తులు వీక్షిస్తారని తెలిపారు. అన్నప్రసాదం, వసతి, ఆరోగ్య విభాగాలు భక్తులకు అందిస్తున్న సేవలను ఫొటోలతో సహా వెబ్‌సైట్‌లో పెడితే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో టిటిడిలోని పలు విభాగాల రోజువారీ కార్యక్రమాలకు ఉపయోగపడేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని టిసిఎస్‌ అధికారులను కోరారు.

ఈ సమావేశంలో టిటిడి ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ శ్రీసుధాకర్‌, టిసిఎస్‌ అధికారి శ్రీ సత్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.