GOVINDARAJA SWAMY BLESSES ON GARUDA VAHANA _ గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం

Tirupati,30 May 2023: On the fifth day of the ongoing annual Brahmotsavam of Sri Govindaraja Swamy temple in Tirupati, the processional deity of Sri Govindaraja Swamy blessed His devotees from the majestic Garuda Vahanam.

Garuda is the favourite carrier of the Lord this Vahana Seva is popular in all 108 Vaishnava Divya Desams.

Both the Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, Kankana Bhattar Sri Srinivasa Dikshitulu, Dyeo Smt Shanti, AEO Sri Ravi Kumar, and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం

తిరుపతి, 2023 మే 30: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మూత్సవాల్లో ఐదో రోజు మంగళవారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తున్నారు . జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తారు.

వాహ‌న‌సేవ‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, కంకణబట్టార్ శ్రీ ఏపి శ్రీనివాస దీక్షితులు, ఎఫ్ఏ సిఏఓ శ్రీ బాలాజి, డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్‌ శ్రీ నారాయణ, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.