TTD OFFICIALS TEAM VISITS VAIDYARATNA AYURVEDA INSTITUTES AT THRISSUR _ త్రిసూర్ లోని వైద్య రత్న ఆయుర్వేద సంస్థలను పరిశీలించిన టీటీడీ అధికారులు 

త్రిసూర్ లోని వైద్య రత్న ఆయుర్వేద సంస్థలను పరిశీలించిన టీటీడీ అధికారులు

తిరుపతి  30 మే 2023: కేరళ రాష్ట్రం త్రిసూర్ లోని వైద్య రత్నం ఆయుర్వేద వైద్య సంస్థలను టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ మంగళవారం సందర్శించారు.

ఆయుర్వేద వైద్యాన్ని కార్పొరేట్ తరహాలో నిర్వహిస్తున్న విధానం, ప్రజలు ఈ వైద్యానికి ఆకర్షితులవుతున్న అంశాలను వారు పరిశీలించారు.

ఈ సంస్థ నిర్వహిస్తున్న పరిశోధన కేంద్రం,ఆసుపత్రి, ఫార్మసీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రోగులు ఆన్లైన్ , నేరుగా వచ్చి ఓపీ, ఇన్ పేషేంట్ సేవలు పొందుతున్న విధానం గురించి అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న ఉచిత వైద్యం గురించి తెలుసుకున్నారు . అలాగే ఈ సంస్థ రుసుము వసూలు చేసి నడుపుతున్న ఆసుపత్రి వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. రోగులు ఏ ప్రాంతం నుండి ఇక్కడికి ఎలా చేరుకుంటున్నారనే సమాచారం తీసుకున్నారు.
ఇక్కడి ఆయుర్వేద పరిశోధన కేంద్రంలో ఏ తరహా మందులు తయారు చేస్తున్నారు. ఏ మందులకు ఎక్కువ డిమాండ్ ఉంది అనే వివరాలు తెలుసుకున్నారు.

ఇక్కడి ఫార్మసీ నిర్వహణ , ముడి పదార్థాల సేకరణ , మందుల తయారీ విధానాలతో పాటు, మందులను ఎలా మార్కెటింగ్ చేయగలుగుతున్నారో చర్చించారు. మార్కెటింగ్ వ్యవస్థ గురించి పరిశీలించారు. అనంతరం టీటీడీ అధికారులు వైద్య రత్నం సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నీలకంఠన్ ను కలసి ఆసుపత్రి నిర్వహణ, వైద్యసేవలు, పరిశోధనలు, మార్కెటింగ్ విధానాల గురించి చర్చించారు.

టీటీడీతో కలసి పనిచేయాలని అధికారులు ఆహ్వానించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది

Tirupati,30, May,2023: A team of TTD officials on a study tour visited the Vaidyaratna Ayurvedic institutes at Thrissur in Kerala on Tuesday, May 30.

 

The TTD team comprising of TTD  JEO Smt Sada Bhargavi, CEO Sri Sesha Shailendra and Superintendent of SV Ayurveda Hospital Dr Renu Dikshit went around the research centre, hospital and pharmacy studying the systems, infrastructure and procedures of attracting patients online and offline, OP and inpatient and free treatments and paid services.

 

At the research centre and the pharmacy, they studied the medicine formulations, demand for ayurvedic medicines, maintenance and marketing of pharmacy, sourcing raw materials and manufacturing processes.

 

Later they also called on the managing director of the Vaidyaratna institutions Sri Neelakantan and discussed abiotic services, maintenance of the hospital, research and marketing practices.

 

Sri Neelakantan expressed happiness on the invitation of TTD to coordinate operations with Vaidyaratna institutions.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI