ADHYAYANOTSAVAMS IN SRI GT_ జనవరి 6 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Tirupati, 5 Jan. 19: The annual Adhyayanotsavams in Sri Govinda Raja Swamy temple will be observed from January 6 to 29 in Tirupati.

This 24 day event is usually observed in the auspicious Dhanurmasa. During these days, Nalayira Divya Prabandha Parayanam will be rendered.

The utsava deities of Sri Govinda Raja Swamy, Sri Devi, Bhu Devi, Senapathivaru, Alwars are brought to the Kalyana Mandapam and Asthanam will be performed.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 6 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

తిరుపతి,2019 జనవరి 04: టిటిడి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 6 నుండి 29వ తేదీ వరకు 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.

మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా జనవరి 16న చిన్నశాత్తుమొర, జనవరి 22న ప్రణయ కలహోత్సవం, జనవరి 29న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.