జనవరి 5న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం,

జనవరి 5న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం,

తిరుపతి,2019 జనవరి 04: తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో జనవరి 5వ తేదీ శనివారం అమావాస్యనాడు సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 10.30 గంటల నడుమ సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

సాయంత్రం 6.00 గంటలకు ఆస్థానం జరుగనుంది. రాత్రి 7.00 గంటలకు నిర్వహించవలసిన హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది. జరుగనుంది. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రం తదితర పర్వదినాలకు చాలా విశిష్టత ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.